కావలి ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ గారి ఆధ్వర్యం లో కమిట్ సభ్యుల తో వినాయకుని ప్రతిమలు ఉచిత పంపిణీ కార్యక్రమం !!
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని గణనాథుని ప్రతిమలను భక్తులకు బహుకరించే కార్యక్రమం 13వ తేదీన,ఆదివారం ఉదయం 9:00 గంటల కు పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర నిర్వహించబడుతుంది.
ఈ కార్యక్రమం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు శ్రీ తటవర్తి రమేష్ గారి ఆధ్వర్యంలో జరుగనున్నది. ఈ పవిత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కమిటీ సభ్యులందరి భాగస్వామ్యం ఎంతో ముఖ్యమైనది.
కావున కమిటీ సభ్యులందరూ 13వ తేదీన తప్పక హాజరై, గణనాథుని ఆశీస్సులు పొందుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
“వినాయకుని ఆశీస్సులతో… ఐక్యతతో ముందుకు సాగుదాం… సేవా కార్యక్రమాలను విజయవంతం చేద్దాం.”
అందరికీ ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు. 🙏🐘🌺
ఇట్లు
మీ
తటవర్తి రమేష్
ఆర్య వైశ్య మహా సభ అడ్మిస్ట్రేటివ్ సెక్రటరీ
కావలి ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు
తెలుగుదేశం పార్టీ స్పోక్స్ పర్సన్ (నెల్లూరు జిల్లా)