కాణిపాక బ్రహ్మోత్సవాలకు కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్‌ గారి కి ఆహ్వానం !!!!!

కాణిపాక బ్రహ్మోత్సవాలకు కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్‌ గారి కి ఆహ్వానం !!!!!

ఘనంగా కాణిపాక స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు – ఆహ్వాన పత్రికను అందుకున్న తటవర్తి రమేష్ గారు 

*భక్తిశ్రద్ధలతో కాణిపాక బ్రహ్మోత్సవాలు: తటవర్తి రమేష్‌ గారి కి దేవస్థాన సిబ్బంది ఆహ్వానం !!!

కావలి: కలం కౌoటర్ న్యూస్

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు,రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శి తటవర్తి రమేష్‌ గారి కి దేవస్థాన సిబ్బంది మర్యాదపూర్వకంగా అందజేశారు. కావలి పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు రమేష్‌ గారి నీ కలిసి బ్రహ్మోత్సవాల వివరాలను వివరించి, అధికారిక ఆహ్వాన పత్రికను, స్వామివారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలనుఅందజేశారు.ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది మాట్లాడుతూ, స్వయంభూగా వెలసి భక్తుల కోర్కెలు తీర్చే కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది సెప్టెంబర్ 14-09-2026 నుండి అక్టోబర్ 04-10-2026 వరకు 21 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల రోజుల్లో స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు, పలు వాహన సేవలు, రథోత్సవం, కల్యాణోత్సవం వంటి వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరుగుతాయని వివరించారు. ఈ పవిత్ర ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని కోరారు.

స్వామివారి ఆశీస్సులు అందరికీ కలగాలి: తటవర్తి రమేష్ గారు కోరుకున్నారు!!!

ఆహ్వాన పత్రికను స్వీకరించిన అనంతరం కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు *తటవర్తి రమేష్  గారు మాట్లాడుతూ ... సకల విఘ్నాలను తొలగించి సకల శుభాలను ప్రసాదించే కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం అందడం తన అదృష్టంగా భావిస్తున్నానని హర్షం వ్యక్తం చేశారు.విఘ్నేశ్వరుని కృపాకటాక్షాలతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఆర్యవైశ్యులు వ్యాపార, సామాజిక రంగాల్లో మరింత ముందుకు సాగాలని స్వామివారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల సమయంలో తప్పక కాణిపాకం క్షేత్రాన్ని దర్శించుకుని స్వామివారి పూజల్లో పాల్గొంటానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు, పట్టణ ప్రముఖులు మరియు దేవస్థాన ప్రతినిధులు పాల్గొన్నారు.




google+

linkedin

Popular Posts

Prama Sweekaram