ఆర్యవైశ్య సంఘం నేత తటవర్తి రమేష్ సేవలు పలువురికి ఆదర్శప్రాయం.... డీఎస్పీ శ్రీధర్నె
ల్లూరు జిల్లా ....కావలి లో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు "తటవర్తి రమేష్" ఆధ్వర్యంలో డిఎస్పీ కార్యాలయంలో కానిస్టేబుళ్లులకు, హోంగార్డులకు, డిఎస్పీ శ్రీధర్ చేతుల మీదగా కాకి యూనిఫా౦లు,కంటి అద్దాలు ,టోపీలు, పంపిణీ చేశారు.ఈ సందర్భంగా డిఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ నిరంతరం ప్రజా సేవలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సేవలు గుర్తించి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రమేష్ అద్దాలు ,టోపీలు ,యూనిఫామ్ లు అందించడం సంతోషంగా ఉందని,అలాగే వర్షాలు కు తడవకుండా రేయన్ కోట్లు కూడా అందజేయాలి అని కోరగా... వెంటనే స్పందించి సుమారుగా 80 మంది పోలీస్ సోదరులకు రేయన్ కోట్లు అందజేస్తాను అని తటవర్తి రమేష్ హామీ ఇచ్చారు . డీఎస్పీ శ్రీధర్ వారికి వారికి పోలీస్ డిపార్ట్మెంట్ తరుపున ఆర్యవైశ్య సంఘానికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో ఒకటో పట్టణ సీఐ ఫరూక్, రెండో పట్టణ సీఐ గిరిబాబు, పోలీస్ సిబ్బంది, మరియు ఆర్యవైశ్య సంఘం సభ్యులు, వాసవి సెవెన్ సభ్యులు, ది కిరాణ మర్చంట్ అసోసియేషన్ సభ్యులు, మిత్రులు, తదితరులు పాల్గొన్నారు🍁🌻









.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)