ఏపీ ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శిగా రమేశ్ నియామకం

 ఏపీ ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శిగా రమేశ్ నియామకం

ఓం శ్రీ వాసవాంబాయ నమః 🙏

రమేశ్ అన్నకు అభినందనలు!

ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శిగా కావలి ముద్దుబిడ్డ తటవర్తి రమేశ్ గారు నియమితులయ్యారు

ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చిన్ని రామ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో, నెల్లూరు జిల్లా కావలికి చెందిన తట్టవర్తి రమేశ్ గారు 2026 వరకు రాష్ట్ర కార్యదర్శిగా సేవలందించేందుకు నియమితులయ్యారు. ఈ గౌరవ పదవికి ఆయనను ఎంపిక చేయడం ఆర్యవైశ్య సమాజానికి గర్వకారణం.

సమాజంలో సేవా దృక్పథంతో, సమన్వయంగా పనిచేస్తూ, ఆర్యవైశ్య కుటుంబాల శ్రేయస్సు కోసం పాటుపడుతూ, రమేశ్ గారు ఇంతవరకూ చేసిన కృషి ఫలితమే ఈ పదవి. ఆయన మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించి, సమాజంలో అత్యున్నత స్థాయికి ఎదగాలని  హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాము.

సమాజానికి మరింత సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న మన రమేశ్ అన్నకు మద్దతుగా, తోడుగా, ప్రతి ఆర్యవైశ్య కుటుంబం నిలవాలని ఆకాంక్ష. రాబోయే రోజుల్లో ఆయన నాయకత్వంలో మరిన్ని పదివి బాధ్యతలు స్వీకరించాలని విశ్వసిస్తున్నాము.

జై వాసవి..... జై జై..... 🙏




google+

linkedin

Popular Posts

Prama Sweekaram