పోలీస్ సిబ్బంది కి రైన్ కోట్లు డీఎస్పి చేతుల మీదగా పంపిణీ చేసిన "తటవర్తి"*
కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు "తటవర్తి రమేష్" ఆధ్వర్యంలో శనివారం కావలి వన్ టౌన్,టూ టౌన్ పోలీస్ సిబ్బందికి 200 మందికి నాణ్యమైన రెయిన్ కోట్లును కావలి డిఎస్పి కార్యాలయం నందు డి.ఎస్.పి శ్రీధర్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా డిఎస్పి శ్రీధర్ మాట్లాడుతూ తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో పోలీసులకు రేయన్ కోట్లు అందజేయడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. వర్షాకాలంలో పోలీసులు నిబద్ధతతో విధులను నిర్వర్తిస్తున్నందుకు రేయన్ కోట్లను పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు. గతంలో కూడా ట్రాఫిక్ పోలీసులకు టోపీలు, కళ్లద్దాలు పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు. తటవర్తి రమేష్ రానున్న రోజుల్లో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేసి అందరి మన్నలను పొందాలని కోరారు.












