ఆర్య వైశ్య జర్నలిస్ట్ లకు ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవ సందర్బంగా ఘనంగా సన్మానము

కావలి ఆర్యవైశ్య సంఘం కార్యాలయంలో  ఆర్య వైశ్య జర్నలిస్ట్ లకు "ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవ"సందర్బంగా ఘనంగా సన్మానము💐

కావలి మండల ఆర్యవైశ్య సంఘం  అధ్యక్షులు 'తటవర్తి రమేష్" ఆధ్వర్యంలో " ప్రపంచ పత్రికాదినోత్సవ వేడుకలను" ఘనంగా నిర్వహించారు. కావలికి చెందిన సీనియర్ జర్నలిస్టులు గెర్రే వెంకటేశ్వర్లు,నంది అవార్డు గ్రహీత డా. పాదర్తి నాగరాజు, బొగ్గవరపు నారాయణ, పువ్వాడ సుబ్బారావులను సత్కరించారు. ఈ సందర్భంగా తటవర్తి రమేష్ మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో విలువైనది అన్నారు. సహృదయులను సన్మానించడం తన అభిమతం అన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు ఓరుగంటి రామకృష్ణ ఓరుగంటి సురేష్ గాదంశెట్టి మధుసూదన్ వేముల సునీల్,పెసల పవన్, తదితరులు పాల్గొన్నారు💐💐💐









google+

linkedin

Popular Posts

Prama Sweekaram