అంగ రంగ వైభవంగా తటవర్తి రమేష్ జన్మ దిన వేడుకలు 21-11-2025
అన్నదాన కార్యక్రమాలు,రైస్ బ్యాగులు,పండ్లు,బిస్కెట్లు పంపిణీ
కావలి మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు తటవర్తి రమేష్ జన్మ దిన వేడుకలు కోదండరామ దేవస్థాన కల్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు.ఆర్యవైశ్య సంఘం సభ్యులు,ప్రముఖులు,మిత్రులు పాల్గొని భారీ స్థాయిలో ఉన్న కేక్ ను కట్ చేసి దృశ్యాలువాలుతో సత్కరించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు
.ఈ సందర్బంగా తటవర్తి రమేష్ మాట్లాడుతూ నేను కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన రోజు నుంచి కావలిలో గతంలో కంటే ఎన్నో సేవా కార్యక్రమాలుచేసి, ఆర్యవైశ్యుల పేరు ప్రఖ్యాతులు తెచ్చేవిధంగాకార్యక్రమాలు చేయడానికి మాకు సహకరించిన మా ఆర్యవైశ్య సంఘం సభ్యులు మిత్రులందరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తెలిపారు
నేను కావలిలో జన్మించడం నా పూర్వజన్మ సుకృతవని భావిస్తున్నాను, ఇటీవల కార్తీక మాసంలో వనమిత్ర కార్తీక సమారాధన కార్యక్రమం నిర్వహించడం, ఈ కార్యక్రమానికి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీ బాల స్వామీజీ వారు కావలి ప్రాంతానికి వచ్చి శివాభిషేకాల నిర్వహించి, ప్రత్యేక పూజలు నిర్వహించడం నాకుఎంతో సంతృప్తిని కలిగించాయని, ఆర్యవైశ్య చరిత్రలో రాష్ట్రస్థాయిలో ఇంత గొప్ప కార్యక్రమాలునిర్వహించడం నాకు చాలా గర్వంగా ఉందని, అందుకు కారణం మా ప్రియతమ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి కావలి అభివృద్ధికి ఎంతో కష్టపడుతున్నారు, మంచి పనులు చేయడం, రాష్ట్రస్థాయిలో ఎలా గుర్తింపు తీసుకొచ్చారో అదే బాటలో ఆర్యవైశ్య సంఘాన్ని కూడా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చి ఆర్యవైశ్యలుమన్ననలు పొందడం నాకు చాలా గర్వంగా ఉందని తెలిపారు. తదనంతరం అన్న క్యాంటీన్లో ఉచితంగా పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం నాకెంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు.
మరియు మంగమూరు హైవే రోడ్ లో ఉన్న ఆదరణ కేంద్రంలో భవాని ఎడ్యుకేషన్ వారికి రైస్ బ్యాగులు బిస్కెట్ ప్యాకెట్లు పండ్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు
ఈ సందర్భంగా భవాని ఎడ్యుకేషన్ బాధ్యులు సింహాద్రి మాట్లాడుతూ అభాగ్యులను గుర్తించి తన పుట్టినరోజు వేడుకలను ఇక్కడ నిర్ణయించడం చాలా గొప్ప విషయం అని గతంలో కూడా వస్తు సామగ్రి కూడా సహాయం చేయడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా తనవంతు రమేష్ దంపతులను దృశ్యాలతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు కిరాణా మర్చంట్ అసోసియేషన్ సభ్యులు వస్త్ర వ్యాపారులు వాసవి క్లబ్ సెవెన్ లైన్ సభ్యులు ఆర్యవైశ్య ప్రముఖులు మిత్రులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.































