ప్రభుత్వం ఇచ్చే కులధృవీకరణ పత్రాల్లో మరియు గ్రామ సచివాలయ ఎంట్రీల్లో ‘‘ఓసీ వైశ్య’’ ని ఆర్యవైశ్య గా మార్చండి
- ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఆర్య వైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ వినతి
- సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
గవర్నమెంటు వారు విధివిదానాల ప్రకారం రాష్ట్రంలో ఇంతకుముందు జరిగిన సర్వేలు/ కులగణనలను బట్టి ఉన్న ఆర్య వైశ్యులను వైశ్య/శెట్టి/గుప్త/కోమటి/లాగా వివిధ వర్గాల వారుగా విభజించి చూపడం వలన రాష్ట్రంలో గవర్నమెంటు వారునిర్వహించే అన్ లైన్ వెబ్ సైట్ లలో,యాప్లలో కూడా ఆర్య, వైశ్యులను వివిధవర్గాలుగా చూపించడంజరుగుతోంది. ముఖ్యంగా,మండల రెవెన్యూ అధికారులుఇచ్చే కులధృవీకరణ పత్రాలలో కూడా"ఒ.సి. వైశ్య" అని మాత్రమేవస్తుంది.అందువలన ఆర్యవైశ్య వర్గాలవారు ఒకవిధమైనతికమకకుగురిఅగుచున్నారు.కావున గవర్నమెంటు వారి ప్రస్తుత జనాభా లెక్కలప్రకారం ఉన్నవారిని,భవిష్యత్తులో జరగబోయే"కుల గణన" విషయంలోగానియాప్లలో గాని, ఆన్ లైన్ సైట్లలోగాని ఒకే వర్గంగా అదీ"ఆర్య వైశ్య" అనేవిధంగానే ఉండేటట్లు చూడవలసినదిగా కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్,మిత్రబృందం విన్నవించుకున్నారు..ఈ కార్యక్రమంలో కర్నూల్ అర్బన్ డెవలప్ మెంట్ ఆధారిటి చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కావలి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్, డా.పాదర్తి నాగరాజు,పల్లెపోతుల వెంకటేశ్వర్లు, ప
లువురు ముఖ్యమంత్రి ని కలిసి వినతిపత్రంఅందించారు.తప్పకుండా పరిశీలిస్తామని చంద్రబాబు తెలిపినట్లు తెలియజేశారు.