నెల్లూరు జిల్లా రూరల్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గా అమర వేదగిరి సుబ్బరాయుడు గుప్తా

నెల్లూరు జిల్లా రూరల్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గా అమర వేదగిరి సుబ్బరాయుడు గుప్తా

ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ మరియు కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అయినటువంటి తటవర్తి రమేష్ గారి ఆధ్వర్యంలో ప్రస్తుతం నెల్లూరు జిల్లా అధ్యక్షులు అమర్తలూరి చెంచయ్య గారి అధ్యక్షతన ఈరోజు 05.08.2026 న నెల్లూరు లో నెల్లూరు క్లబ్ నందు నెల్లూరు జిల్లా రూరల్ ఆర్యవైశ్య సంఘానికి సంబంధించి అధ్యక్షున్ని ఎన్నుకునేదానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది, ఆ సమావేశానికి జిల్లాలోని అన్ని మండలాల ఆర్యవైశ్య నాయకులు రావడం జరిగింది,  ఈ సమావేశంలో అందరూ చర్చించిన పిదప  అందరి ఆమోదయోగ్యంతో  నెల్లూరు జిల్లా రూరల్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గా కావలి మండల ఆర్యవైశ్య సంఘం గౌరవాధ్యక్షులు, వాసవి సత్రాల సముదాయం కార్యవర్గ సభ్యులు, మాజీ కౌన్సిలర్, కావలి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం వైస్ ప్రెసిడెంట్, అయినటువంటి ప్రముఖ వస్త్ర వ్యాపారి శ్రీ అమర వేదగిరి సుబ్బరాయుడు గుప్తా గారిని ఏకగ్రీవంగా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, అన్ని మండలాల నాయకులు,  అధ్యక్షులు ఆర్యవైశ్య ప్రముఖులువారి పేరుని తీర్మానించడం జరిగినది, ఈ తీర్మానాన్ని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ఇల్లూరు లక్ష్మయ్య గారికి పంపడం జరిగినది అని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అడ్మినిస్ట్రేషన్ సెక్రెటరీ రమేష్ గారు తెలియజేయడమైనది.



google+

linkedin

Popular Posts

Prama Sweekaram