శ్రీ బాలస్వామీజీని తమ స్వగృహానికి ఆహ్వానించి, సత్కరించిన తటవర్తి రమేష్ శ్రీమతి శిరీష దంపతులు ( అధ్యక్షులు- మండల ఆర్యవైశ్య సంఘం )
"తటవర్తి" కి పెనుగొండ పీఠాధిపతి బాల స్వామీజీ ఆశీస్సులు
కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు "తటవర్తి రమేష్ -శిరీష" దంపతులను పెనుగొండ పీఠాధిపతి "బాల స్వామీజీ" ప్రత్యేకంగా ఆశీస్సులు అందించారు. ఆయన గత నెల 15న పెనుగొండ నుంచి తిరుమలకు పాదయాత్ర నిర్వహించడం మార్గమధ్యంలో 21 కేంద్రాల్లో శ్రీనివాస కళ్యాణం చేయడం జరిగింది.ఆ సందర్భంలో కావలికి వచ్చినప్పుడు పాదయాత్రలో తన వెంట నడవడంతోపాటు స్థానిక బృందావనం కాలనీలో శ్రీనివాస కళ్యాణం నిర్వహించేందుకు విశేష కృషి చేసిన "తటవర్తి రమేష్ -శిరీష" దంపతుల ఆధ్యాత్మిక శ్రద్ధ ఎంతో అమోఘమని స్వామీజీ ప్రత్యేకంగా కొనియాడారు వారిని ఆదర్శంగా తీసుకొని స్థానికంగా అందరూ సనాతన ధర్మం కాపాడేందుకు తమవంతుగా తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు.
సనాతన సంప్రదాయాలను తరవాత తరాల వారికి తీసుకెళ్లడంలో ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న వారంతా తప్పక కృషి చేయాలని సూచించారు.
తిరుమలలో రెండువేల మందితో గానమృతం చేసిన సంగతిని కూడా విలేకరులకు ఈ సందర్భంగా వివరించారు. పలువురు ఆర్యవైశ్య నేతలు,భక్తులు తటవర్తి రమేష్ నివాసానికి చేరుకుని బాల స్వామి ఆశీర్వాదం పొందారు. 💐💐