సిఐ ఫిరోజ్ సమక్షంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్, సభ్యులు సంపంగి భూదేవి ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించరు

మతిస్థిమితం లేని సంపంగి భూదేవి అనే మహిళ 11 నెల క్రితం రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం నుంచి తప్పిపోయి కావలికి చేరుకోవడం జరిగింది. కొందరు ఆర్యవైశ్య నేతలు ఆ మహిళ వివరాలను సేకరించేందుకు సామాజిక మాధ్యమాలలో ఫోటోను పెట్టడం జరిగింది. సమాచారం తెలుసుకున్న సంపంగి భూదేవి కుటుంబ సభ్యులు ఆర్యవైశ్య సంఘాన్ని సంప్రదించారు.

శుక్రవారం రోజున ఒకటో పట్టణ సిఐ ఫిరోజ్ సమక్షంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్ ,రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ తటవర్తి వాసు ఆర్యవైశ్య సంఘం సభ్యులు సంపంగి భూదేవి ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించి మానవత్వం చాటుకున్నారు. మహిళ కుటుంబ సభ్యులు  ఆర్యవైశ్య సంఘానికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా సిఐ ఫిరోజ్ మాట్లాడుతూ ఇలాంటి సేవ కార్యక్రమాలు చేస్తున్న ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ ని వారి సంఘం సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో
ఆర్యవైశ్య సంఘం సెక్రటరీ ఓరుగంటి రామకృష్ణ,ట్రెజరర్ కళ్యాణ్ చక్రవర్తి, సభ్యులు ఓరుగంటి సురేష్ బాబు, నేరేళ్ల శివ, వేముల సునీల్, చెక్క అజయ్, గంగిశెట్టి నందకిషోర్, మధు రెడ్డి, గాదంశెట్టి మధు, విఎంఎన్ఆర్ మాలి పాల్గొన్నారు.

google+

linkedin

Popular Posts

Prama Sweekaram