మార్చి 24 వ తేదిన నెల్లూరు జిల్లా... కావలి పట్టణానికి పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి పరమపూజ్య శ్రీ ప్రజ్ఞ నంద సరస్వతి బాల స్వామిజీ వస్తున్నారని వారి చేతుల మీదగా శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం జరుగుతుందని కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ తెలిపారు.
ఆయన తన కార్యాలయంలో కళ్యాణ మహోత్సవ పోస్టర్లను ఆర్యవైశ్య సంఘం సభ్యుల తో కలిసి ఆవిష్కరించారు
ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ మాట్లాడుతూ గోవిందుని పాద సేవలో తెనాలి నుండి తిరుమల వరకు పాదయాత్ర గా వెళ్తున్న పెనుగొండ పీఠాధిపతి బాల స్వామిజీ చేతుల మీదుగా 24 వ తేదిన కావలి బృందావనం కళ్యాణ మండపంలో సాయంత్రం 5:30ని.లకు శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం జరుగుతుంది
కావున పట్టణ ప్రజలు,స్వామి భక్తులు విచ్చేసి స్వామి వారి కళ్యాణ లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్,కమిటీ సభ్యులు కోరారు.