వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయనిర్మాణానికి 10 లక్షల రూ//విరాళం అందజేసిన తటవర్తి
నెల్లూరు జిల్లా..... కావలిలో వాసవి మాత కన్యకా పరమేశ్వరి అగ్నిగుండ ప్రవేశం గా పిలుచుకునేరోజును రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆత్మార్పణదినోత్సవంగా నామకరణ చేసిన శుభ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి కి కావలి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తట్టవర్తి రమేష్, పలువురుఆర్యవైశ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వాసవి మాత కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలునిర్వహించారు
అనంతరం వాసవి మాత కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం నిర్మాణానికి ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు తట్టవర్తి రమేష్ 10 లక్షలరూపాయలు విరాళాలంను ఆలయకమిటీ సభ్యులకు అందజేశారు... ఈ సందర్భంగా తటవర్తిరమేష్ కు ఆర్యవైశ్య సంఘ సభ్యులు,ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.. అనంతరం తటవర్తి రమేష్ మాట్లాడుతూ ఆత్మార్పణ దినోత్సవంగా ప్రకటిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెనుగొండలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఎంత శుభ పరిణామం అన్నారు.వాసవి మాత కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం నిర్మాణానికి దాతలు ఇంకా ముందుకు వచ్చి సహకారాన్ని అందించాలని ఆయన కోరారు.