అమరజీవి విగ్రహాం కు మరమత్తులు
పరిశీలిస్తున్నఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు
కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో ట్రంక్ రోడ్ లో ఉన్న "అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు" విగ్రహానికి మర మత్తులు చేసి, గోల్డ్ కలర్ రంగులు వేపిచ్చి, అపరశుభ్రంగా ఉన్న చుట్టుపక్కలప్రాంతం అంతా సిమెంట్ తో ప్లాట్ ఫామ్ నిర్మించి చూడచక్కగా తన పర్యవేక్షణలో దగ్గరుండి మరమ్మత్తులు చేయించడం జరిగింది.
మన తెలుగు రాష్ట్రం ఏర్పాటుకావడానికి "శ్రీపొట్టి శ్రీరాములు" ప్రాణాలు అర్పించిన మహనీయుడు విగ్రహం పాడుఐపొడం నామనసు చలించి నా సొంత ఖర్చులతో విగ్రహం తో పాటు పరిశుభ్రమైన వాతావరణ ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో మరమ్మత్తులు చేపించడం జరిగిందని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ తెలియజేశారు
.
తటవర్తి రమేష్ వెంట కావలి చినజియ్యర్ స్వామి,ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు గాధంశెట్టి మధు సూధన్ లు ఉన్నారు.