మహాత్మా గాంధీ 155 వ జయంతి సందర్భంగా కావలి ట్రంక్ రోడ్డులో ఉన్న గాంధీ విగ్రహానికి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికిపూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
తటవర్తి రమేష్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఆశయాలను తూచా తప్పకుండా అందరు పాటించాలని అహింసా మార్గంలో అందరూ నడుచుకోవాలని, గ్రామ స్వరాజ్యం కోసం పాటుపడుతూ ఆయన మార్గంలో నేటి కూటమి ప్రభుత్వం గ్రామ స్వరాజ్యం దిశ గా పయనించడం చాలా సంతోషంగా విషయమని ,అలాగే కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి 100 అడుగుల జాతీయజెండా ఏర్పాటు చేసి కావలి ఐకాన్ గా రూపొందించడం, జాతీయ నాయకులందరూ చిత్రపటాలు ఏర్పాటు చేయడం చాలా గర్వించదగ్గ విషయమని, ఈ సందర్భంగా కొనియాడారు. కావలి కలకపట్టణం అయ్యేదానికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణా కి మనమందరం అండగా నిలవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు, గాంధీ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు.