కావలి ఆర్యవైశ్య సంఘం అద్వర్యంలో గురు పూజోత్సవం
కావలి మండల ఆర్యవైశ్య సంఘం అద్వర్యంలో గురు పూజోత్సవం
- కావలి; బాపూజి నగర్ నందు కావలి మండల ఆర్యవైశ్య సంఘం అద్వ్యర్యంలో గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
- కావలి మండలంలో ఉన్న ఆర్యవైశ్య ఉపాధ్యాయులును ఆహ్వానించి వారికి దృశ్యాలతో సత్కరించిమోమోoటూను,పండ్లును అందజేయడం జరిగింది
- ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ మాట్లాడుతూ....మనం పుట్టగానే లోకానికి పరిచయం చేసిన అమ్మ మొదటి గురువైతే. గుండెలపై తన్నుతూ ఆటలాడే శిశువుకు నడక నేర్పే నాన్న రెండో గురువు.
- ఆ తర్వాత ఈలోకంలోఎలా నడుచుకోవాలో నేర్పి, విద్యా బుద్ధులు అందించే వారే మూడో గురువు ఉపాధ్యాయులు అని అలాంటి గురువులను మనం ఈరోజు వారిని గౌరవించడం మన బాధ్యత అని తెలిపారు
- ఈ సందర్భంగా ఉపాధ్యాయులందరికీ పేరు పేరునా హృదయపూర్వక ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలుతెలిపారు.
- ఈ కార్యక్రమంలో 26 మంది ఉపాధ్యాయులు, ఆర్య సంఘం అధ్యక్షలు ,కార్యదర్శులు, మరియు సభ్యులు, పాల్గొన్నారు